FbTelugu

పండుగకు 4,980 ప్రత్యేక బస్సులు

* 8 నుంచి 14 వరకు నడపనున్న టీఎస్ఆర్టీసీ
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్తను తీసుకొచ్చింది. ఈ నెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. స్పెషల్ బస్సులకు సంబంధించిన వివరాలను రీజనల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4,980 స్పెషల్ బస్సులు నడపనుండగా అందులో 3,380 తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నడపనుండగా..1,600 బస్సులు ఏపీకి నడపనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరనున్నట్టు తెలిపారు.

ఎంజీబీఎస్ నుంచి నాగర్‌కర్నూలు, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు, గుంటూరు, నారాయణ‌ఖేడ్, శ్రీశైలం, కల్వకుర్తి, విజయవాడ, విశాఖపట్టణం, బెంగళూరు, ఖమ్మం, రాయచూర్, మహబూబ్‌నగర్, నాగ్‌పూర్, అమరావతి, పెబ్బేరు, కొత్తకోట, మెదక్, బాన్సువాడ, బోధన్, బీదర్, తాండూరు, వికారాబాద్ వైపు బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. అలాగే.. జేబీఎస్ (జూబ్లీ బస్‌స్టేషన్) నుంచి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లావైపు, దిల్‌సుఖ్‌నగర్ నుంచి మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు సీబీఎస్ నుంచి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ఒంగోలు, మాచర్ల, నెల్లూరు వైపు, ఉప్పల్ క్రాస్‌రోడ్డు నుంచి యాదరిగి గుట్ట, వరంగల్ వైపు వెళ్లే బస్సులు బయలుదేరుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.