FbTelugu

ఏపీలో మరో 48 కేసులు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తాజాగా ఇవాళ మరో 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో ఏపీలో ప్రస్తుతం మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 2,719 కి చేరింది. ఇప్పటివరకు ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 57 కు చేరింది.

దీనికి సంబంధించి ఏపీ హెల్త్ బులెటిన్ తాజాగా విడుదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం యాక్టీవ్ కేసులు 759 ఉన్నాయి. ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,903 కు చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో నాలుగు కేసులు కోయంబేడు లింకు కేసులేనని తెలిపారు. గడిచిన 24 గంటల్లో మరో 55 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినారు.

You might also like