FbTelugu

లాక్ డౌన్ పై 48 గంటల గడువు: హైకోర్టు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 48 గంటలలో కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ పై కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే మేమే ఆదేశాలు ఇస్తామని తేల్చి చెప్పింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు, ప్రభుత్వ చర్యలపై ఇవాళ హైకోర్టు విచారించింది. గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలపై అసంపూర్తి నివేదిక ఇవ్వడంతో ఆగ్రహించిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ నమోదైన కేసులు వార్డుల వారిగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టు రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చూడాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. హాస్పిటల్స్ లో పాజిటివ్ రోగులకు సలహాలు ఇవ్వడానికి నోడల్ అధికారి ని నియమించాల్సిందేనని స్పష్టం చేసింది. www.health.telangana.gov.in వెబ్ సైట్ లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలని పేర్కొంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, బహిరంగ ప్రాంతాలలో ఎక్కువ మంది గుమికూడితే వారి పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా కేసులు, నియంత్రణ పై తెలంగాణ డిజిపి, వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని హైకోర్టు ఆక్షేపించింది.

కేసులు పెరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించిన హైకోర్టు… ఏం నిర్ణయం తీసుకున్నారని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. రెండు రోజుల్లో మేము ఏమి చేయలేమని ఎజి చేతులెత్తేశారు. 48 గంటలు సమయం ఇస్తున్నాం, మీరు ఏమి చేస్తారో అది చేయండి. ఆ తర్వాత మేము ఏది చేయాలో అది చేస్తామని హైకోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.