అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 477 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదేసమయంలో కరోనాతో ఐదరుగు మృత్యువాత పడ్డారు. కొత్తగా కరోనా బారిన పడిన వారిలో ఏపీ వారు 439 మంది ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 34 మంది ఉన్నారు.
cccవిదేశాల నుంచి వచ్చిన వారు నలుగురు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,929 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 106 కు చేరింది. ప్రస్తుతం ఏపీలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 4,516 గా ఉంది. కరోనా బారినుంచి కోలుకొని 4,307 మంది డిశ్చార్జ్ అయినారు.