FbTelugu

ఏపీలో కొత్తగా 465 మందికి కరోనా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 465 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా కేసులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీ వారు 376 మంది ఉన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు70 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి కరోనా సోకినట్టు తెలిపారు. గడిచిన 24 గంటల్లోనే కరోనాతో నలుగురు మృత్యావాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96 కు చేరింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,961కి చేరింది.

You might also like