FbTelugu

కల్తీ కల్లుతో 45 మందికి అస్వస్థత

వికారాబాద్:​ రెండు గ్రామాల్లో అంతుచిక్కని వ్యాధితో 45 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

వికారాబాద్ మండలం ఎర్రవల్లి, నవాబుపేట్ మండలం చిట్టిగిద్దలో పలువురు అనారోగ్యం పాలయ్యారు. అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయిన 45 మందిని గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. దీనిపై గ్రామస్థులు వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వికారాబాద్ డీఎంహెచ్‌వఓ తో మాట్లాడి, ఎర్రవల్లి, చిట్టిగిద్దలో తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఈ ఘటనకు కల్తీ కల్లు కారణమని స్థానికులు చెబుతున్నారు. కల్లులో మోతాదుకు మించి కెమికల్స్ కలపడం మూలంగానే ఇది చోటు చేసుకుందని అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.