FbTelugu

45 లక్షల కేసులు, 3 లక్షలు మృతి

ప్రపంచ వ్యాప్తంగా నిన్నటి వరకు 45.26 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 3.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. యూఎస్, యూకే, బ్రెజిల్‌లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది.

అగ్రరాజ్యం అమెరికాలో నిన్న ఒక్కరోజే 26,398 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అమెరికాతో పాటు బ్రెజిల్ లో 13,761, యూకే లో 3,446కేసులు, రష్యా లో 9,971 కేసులు వెలుగు చూశాయి. భారత్‌లో నిన్న ఒక్క రోజే 3,942 మంది కరోనా బారినపడ్డారు.

ఇప్పటి వరకు అమెరికాలో 13 లక్షల మందికి పాజిటివ్ సోకగా 86 వేల మందికి పైగా మరణించారు. తరువాతి స్థానంలో యూకే ఉండగా, ఇప్పటి వరకు 2.29 లక్షల మందికి వ్యాధి రాగా, 33,186 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో 2.22 లక్షల మందికి వైరస్ సోకగా, 33,106 మంది చనిపోయినట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. వరుసగా స్పెయిన్, ఫ్రాన్స్, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి.

అమెరికాలో నిన్న ఒక్కరోజే 1,703 మంది మరణించారు. స్పెయిన్‌లో 217 మంది, బ్రిటన్‌లో 428 మంది, ఇటలీలో 262 మంది, బ్రెజిల్‌లో 835 మంది, ఫ్రాన్స్‌లో 351 మంది మెక్సికోలో 294 మంది, కెనడాలో 170 మంది కరోనా తో చనిపోయారు. అమెరికాలో మొత్తంగా 86,900 మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోవడం విషాదం.

You might also like

Leave A Reply

Your email address will not be published.