FbTelugu

ఏపీలో 443 కొత్త కేసులు

విజయవాడ: రాష్ట్రంలో ఇవాళ 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. స్థానికంగా ఉంటున్న 392 మందితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 44 మందికి వైరస్ సోకింది.

వీరితో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన ఏడుగురు కలిపి మొత్తం 443 కి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఇవాళ ఐదుగురు మరణించగా, మొత్తం 111 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4826 మంది చికిత్స పొందుతుండగా, 4435 మంది డిశ్చార్జీ అయ్యారు.

You might also like