FbTelugu

తెలంగాణలో 41 కేసులు, నలుగురు మృతి

హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ 41 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ రాగా వ్యాధి బారిన పడ్డ  నలుగురు మృతి చెందారు.

41 కేసులలో 23 మంది జీహెచ్ఎంసీ పరిధికి చెందిన వ్యక్తులు కాగా, రంగారెడ్డి జిల్లాకు చెందినవారు ఒకరున్నారు. 11 మంది వలస కార్మికులకు, విదేశాల నుంచి వచ్చినవారిలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలంగాణ బులెటిన్ లో వెల్లడించారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,854కి చేరుకోగా, ఇవాళ 24 మంది డిశ్చార్జి అయ్యారు.

దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,092కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 709 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 53కి చేరింది

You might also like