FbTelugu

తెలంగాణ పాజిటివ్ కేసులు 4,009

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 83,089 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తే కొత్తగా 4,009 పాజిటివ్‌ కేసులు వెల్లడి అయ్యాయి. ఈ సంఖ్యతో ఇప్పటి వరకు మొత్తం 3,55,433కి చేరింది.

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌ లో వివరాలు ఇలా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనాతో 14 మంది మరణించగా ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1,838కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,878 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇంత వరకు కోలుకున్న వారి సంఖ్య 3,14,441కి ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 705 కేసులు నమోదయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.