కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే ఇప్పటివరకూ కరోనా వైరస్ కు మందు లేకపోవడంతో ఈ వైరస్ ప్రభావానికి ప్రపంచం విలవిలలాడుతోంది.
ఈ తరుణంలో కరోనాకు వ్యాక్సిన్ ను కనుగొనడానికి సుమారు 400 మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. వందల వ్యాక్సిన్లు పరిశోధన దశల్లో ఉన్నాయని తెలిపారు. వాటిలో ఏడెనిమిది మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.