FbTelugu

టీ అసెంబ్లీలో 40 కొత్త సీట్లు

హైదరాబాద్: కరోనా మహమ్మారి సమయంలో భౌతిక దూరం పాటించేందుకు శాసనసభలో కొత్తగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేసినట్లు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్షాకాల సమావేశాలపై సమావేశం నిర్వహించారన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉందన్నారు. కరోనా నేపథ్యంలో అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మార్షల్స్ కు రెండు రోజుల ముందే పరీక్షలు నిర్వహిస్తామని, మీడియా ప్రతినిధులకు కూడా పరీక్షలు చేస్తామన్నారు. శాఖల వారీగా అవసరం ఉన్న అధికారులు మాత్రమే అసెంబ్లీ వచ్చే చర్యలు తీసుకుంటున్నామన్నారు.

You might also like