FbTelugu

పానీపూరి తిన్న 40 మంది చిన్నారులకు అస్వస్థత

అదిలాబాద్: పానీపూరి తిన్న 40 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన జిల్లా కేంద్రంలోని ఖుర్షీద్‌నగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే స్థానిక సుందరయ్యనగర్‌ లో నిన్న ఓ పానీపూరీ తోపుడు బండి వద్ద పానీ పూరీ తిన్న సుమారు నలబైమంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైనారు.

దీంతో వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారందరూ..ఐదు నుంచి పదేళ్లలోపు వారే కావడం గమనార్హం. కాగా చిన్నారులకు ప్రాణాపాయమేమీ లేదని రిమ్స్ డైరెక్టర్ స్పష్టం చేశారు.

You might also like