FbTelugu

ఆ రాష్ట్రంలో 4ఏళ్ల డిగ్రీ కోర్సులు

హైదరాబాద్: మూడేళ్ల డిగ్రీ కోర్సు కాస్త నాలుగేళ్లుగా మార్చారు. ఇక నుంచి కర్ణాటక రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ అమలు చేయనున్నారు. జాతీయ విద్యా విధానం కు అనుగుణంగా అన్ని యూనివర్సిటీల్లో ప్రారంభించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిగ్రీ కాలేజీలు అక్టోబర్ తొలివారం నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించనున్నాయి. మంగళవారం నాడు కర్ణాటక విద్యాశాఖ మంత్రి డాక్టర్ అశ్వత్థనారాయణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఇప్పట్లో కరోనా అంతమయ్యే సూచనలు లేనందున విద్యార్థులకు ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కోర్సులు నిర్వహించాలని సూచించారు. బిఎస్సి లో ప్రవేశం కోసం కామన్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహించడం లేదని అన్నారు. యూనివర్సిటీలు, కాలేజీలలో విద్యార్థుల వివరాల నమోదు కోసం ప్రత్యేక వెబ్ ఫోర్టల్ ను సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఫోర్టల్ అందుబాటులోకి రానుందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.