FbTelugu

తమిళనాడులో 4వేలు… 60 మంది మృతి

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతునే ఉన్నది. గడచిన 24 గంటల వ్యవధిలో 4150 కేసులు నమోదు కాగా 60 మంది చనిపోయారు.

దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1.11 లక్షలకు చేరుకోగా, 46860 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 62778 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటి వరకు 1510 మంది ప్రాణాలు కోల్పోయారు. మొన్నటి వరకు రోజుకు 5వేలకు పైగా కేసులు నమోదు కాగా రెండు రోజులుగా నాలుగు వేల వరకు కొత్త కేసులు వస్తున్నాయి.

You might also like