FbTelugu

కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం… 4గురు మృతి

ముంబయి: నాగ్పుర్ కరోనా ప్రత్యేక ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు రోగులు మంటల్లో చిక్కుకుని మృతిచెందారు. మరికొందరి రోగులకు  తీవ్రంగా గాయాలయ్యాయి.

శుక్రవారం రాత్రి 8.10 గంటలకు వాడి ప్రాంతంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే ఆసుపత్రి సిబ్బంది స్థానిక ఫైర్ సర్వీసు అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి రెండో అంతస్తులో ఉన్న ఐసీయూ గదిలో అగ్నిప్రమాదం తొలుత సంభవించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అగ్ని ప్రమాద శకటాలు చేరుకునే లోగానే మంటలు వ్యాప్తి చెందాయి. ఈ ఘటనలో నలుగురు చనిపోగా పలువురు గాయపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన రోగులను బయటకు పంపించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయాలతో ప్రమాదం నుంచి బయటపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.