FbTelugu

4 హాస్పిటళ్లపై జరిమానా: జెసి డాక్టర్ సిరి

అనంతపురం: ఏపి లో కరోనా బాధితులను పీల్చి పిప్పి చేస్తున్న ప్రైవేటు హస్పిటళ్లపై ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నది. ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ జరిపి భారీగా జరిమానాలు విధిస్తున్నది.

కృష్ణా జిల్లాల్లో 50 ప్రైవేటు హాస్పిటళ్లపై చర్యలు తీసుకున్నారు. ఒక్కో హాస్పటల్ పై కనీసం రూ.2 లక్షలు మొదలు రూ.15 లక్షల వరకు జరిమానా విధించారు. కొన్ని హాస్పిటళ్లను సీజ్ చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనాకు చికిత్స నిరాకరించినా, మొత్తం మంచాల సంఖ్యలో సగం ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా కేటాయించకుండా యాజమాన్యాలు తీవ్ర నిర్లక్ష్యం పాటిస్తూ ధనార్జనే ధ్యేయంగా సేవలు అందిస్తున్నాయి. రోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారు.

అనంతపురం జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ హాస్పిటళ్లపై జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం లో నాలుగు ప్రైవేటు ఆసుపత్రులకు భారీగా జరిమానా విధించారు. ఆశా ఆసుపత్రికి రూ.3 లక్షలు, ఎస్వీ హాస్పిటల్ రూ.2 లక్షలు, సాయిరత్న హాస్పిటల్ రూ.2.10 లక్షలు, ఎస్ఆర్ హాస్పిటల్ రూ.2.55 లక్షల చొప్పున జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. కరోనా పాజిటివ్ సాకుతో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేశారని ఫిర్యాదు అందాయి. అక్రమాలకు పాల్పడే యాజమాన్యాలపై కఠిన చర్యల కోసం ఇప్పటికే 256 జీఓ జారీ చేసింది. అధిక ఫీజులకు పదింతల జరిమానా విధించాలని జిఓ లో పేర్కన్నారు. అక్రమాలను సహించేది లేదు, రెండో సారి తప్పు చేసే ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు చేస్తామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.