FbTelugu

24 గంటల్లోనే 3,967 కేసులు నమోదు

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 82 వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లోనే దేశంలో కొత్తగా 3,967 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. 100 మంది మృతి చెందారు. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఏకంగా 81,970 కి చేరింది.

కాగా నేటివరకు కరోనా బారినుంచి 27,920 మంది కోలుకొని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు. ఈ మహమ్మారి బారిన పడి 2,649 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 51,401 కి చేరింది.

You might also like