FbTelugu

తెలంగాణలో 3840 పాజిటివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడచిన 24 గంటల్లో తెలంగాణ లో కొత్తగా 3840 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కరోనా పాజిటివ్ తో 9 మంది మృతి చెందారు.

కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రంలో ఇవే అత్యధిక కేసులు కావడం కలవరానికి గురి చేస్తున్నది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో 1797 కి కరోనా పాజిటివ్ మృతుల సంఖ్య చేరింది. తెలంగాణలో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 30494. కరోనా పాజిటివ్ తో ఇంటివద్దే చికిత్స తీసుకుంటున్నవారు 20215 మంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 505 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు హెల్త్ బులెటిన్ లో తెలిపారు

You might also like

Leave A Reply

Your email address will not be published.