FbTelugu

భారత్ లో కొత్తగా 37,148 కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతూ ఉంది. దేశంలో కొత్తగా 37,148 కరోనా కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 587 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 11,55,019 కి చేరింది. మొత్తం కరోనా మృతుల సంఖ్య 28,084 కి చేరింది. కాగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి 7,24,578 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 4,02,529 కి చేరింది.

You might also like