FbTelugu

ఒక్కరోజే 3,449 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 3.57 లక్షల‬ మంది వైరస్ బారినపడ్డారు. కరోనా బారినపడిన వారిలో 3,449 మంది మృతిచెందారు.
గడచిన రెండు వారాలుగా దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,57,229 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల మార్క్ను చేరింది. వైరస్ సోకిన వారిలో నిన్న 3,449 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మొత్తం మరణాలు 2,22,408. యాక్టివ్ కేసులు 34,47,133 ఉండగా మొత్తం కోలుకున్నవారు 1,66,13,292. దేశంలో ఇప్పటివరకు మొత్తం 15.89 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.