FbTelugu

33శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచే: ఎల్లా కృష్ణ

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో హైదరాబాద్ నగరంలోనే 33 శాతం ఉత్పత్తి అవుతున్నాయని భారత్ బయటెక్ ఎం.డి డాక్టర్ ఎల్లా కృష్ణ తెలిపారు.

కరోనా టీకా పురోగతి తెలుసుకునేందుకు 64 దేశాలకు చెందిన రాయబారులు, హై కమిషనర్లు ఇవాళ హైదరాబాద్ కు వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా శామీర్ పేటలోని జినోమ్ వ్యాలీకి వెళ్లారు. తొలుత వారు భారత్ బయోటెక్ కంపెనీ సందర్శించారు. ఈ సందర్భంగా రాయబారులు, హై కమిషనర్లకు ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మానవ జాతి మనుగడ కోసం వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేయాల్సి ఉంటుందని, ఫార్మా రంగానికి ఢోకా లేదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని ఎల్లా కృష్ణ వివరించారు.
హైదరాబాద్ లో అమెరికా దేశం ఎఫ్.డీ.ఏ ఆమోదం తెలిపిన కంపెనీలు అధికంగా ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తున్నదని, ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నది, ఇప్పటి వరకు తయారు చేసిన ఉత్పత్తులను ఆయన రాయబారులకు వివరించారు. భారత్ బయోటెక్ లో సందర్శన పూర్తయిన తరువాత రాయబారులు, హైకమిషనర్లు బయాలాజికల్ ఇవాన్స్ కంపెనీకి వెళ్లిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.