FbTelugu

ఏపీలో 3263 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 33,755 కొవిడ్‌ నమూనాలను పరీక్షించగా వాటిలో 3,263 మందికి కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు తేలిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా బారిన పడి చికిత్స పొందుతూ గడచిన 24 గంటల్లో 11మంది చనిపోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 9,28,664కు చేరుకోగా, మరణాలు 7,311కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 23,115 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 1,54,63,146 నమూనాలను పరీక్షించారు.
బెజవాడలో వ్యాక్సిన్ల కొరత…
నగరంలోని పలు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ‘‘నో వ్యాక్సిన్ టుడే బోర్డులు’’ దర్శనం ఇస్తున్నాయి. టీకా మహోత్సవం రెండో రోజే వ్యాక్సిన్లు లభించకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. టీకా మహోత్సవ్ కారణంగా ఆదివారం సాయంత్రనాకి వ్యాక్సిన్ డోసులు ఖాళీ అయ్యాయి. నో వ్యాక్సిన్ బోర్డులను చూసి ప్రజలు వెనక్కి వెళ్లిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.