న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో గడిచిన ఒక్క రోజే కొత్తగా 30,254 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో కరోనాతో 391 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
తాజా కేసులతో దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 98,57,029కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,43,019 కి చేరింది. కరోనా బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 93,57,464 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు.