FbTelugu

ఏపీలో ఇకనుంచి రోజూ 30వేల పరీక్షలు

విజయవాడ: ఏపీ ప్రభుత్వం కరోనా వైద్య పరీక్షల సంఖ్యకు క్రమంగా పెంచుకుంటూ వెళ్తున్నది. మొన్నటి వరకు ప్రతి రోజు 10వేల పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం 20వేల దాకా నిర్వహిస్తోంది.

ఇకనుంచి రోజూ 30వేల వరకు నమూనాలు సేకరించి పరీక్షించనున్నది. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న 20వేల నమూనాల్లో నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్య కరోనా పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. పెద్ద ఎత్తున నమూనాలు పరీక్షించేందుకు ఐ మాస్క్ బస్సులను కొనుగోలు చేసింది. ఈ బస్సులు బుధవారం నుంచి ఉపయోగంలోకి రానున్నాయి.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.