FbTelugu

పొడుగు 30 ఇంచులు… పెళ్లి కోసం తల్లడిల్లాడు!

లక్నో: సమాజంలో మరుగుజ్జులకు పెళ్లి ఒక సమస్యగా పరిణమిస్తున్నది. ఊర్లో ఉన్నవారందరికీ వివాహాలు అవుతాయి కాని వీరికి మాత్రం కావు. తమ సైజు అమ్మాయి కోసం వెతికి వెతికి వేసారి పోతారు.

కైరానాకు చెందిన అజీమ్ మన్సూరి పెళ్లీడు వయస్సు వచ్చింది కాని అమ్మాయి దొరకడం లేదు. తన ఎత్తు 30 ఇంచులు మాత్రమే కాకవడంతో ఆ సైజు అమ్మాయి దొరకడం దుర్లభంగా మారింది. భార్య కోసం ఐదేళ్ల నుంచి వెతికి అలసిపోయిన మన్సూరీ చివరకు పోలీసుల సాయం కోరాడు. తనకో మంచి పిల్లను వెతికిపెట్టమని వేడుకోగా, ఆ విషయం సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందింది. ఇంకేముంది అతన్ని చేసుకుంటామంటూ ఇద్దరు అమ్మాయిలు ఫొటోలు, వివరాలు పంపించారు. ఘజియాబాద్ కు చెందిన రెహానా అన్సారీది అతని ఎత్తు ఉంది. ఒప్పుకుంటే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని రెహానా తెలిపింది. ఇక ఢిల్లీకి చెందిన మరో యువతి కూడా అజీమ్ తో కలిసి నడిచేందుకు ఉబలాటపడుతోంది. ఇద్దరి ఒంటరి వాళ్లమే, పెళ్లాడాలని అనుకుంటున్నాని ఢిల్లీ యువతి అతనికి వీడియో పంపించింది. పోలీసుల పుణ్యమా అని మన్సూరి కి అమ్మాయిల సంబంధాలు వస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.