FbTelugu

3 వ్యాక్సిన్లు ముందంజలో ఉన్నాయి: ఐసీఎంఆర్

ఢిల్లీ: దేశంలో మూడు వ్యాక్సిన్లు ప్రయోగ దశల్లో ఉన్నాయని అఖిల భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ వెల్లడించారు. కాడిలా, భారత్ బయోటెక్, సిరిమ్ ఇనిస్టిట్యూట్ అని ఆయన తెలిపారు.

కాడిలా, భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు తొలిదశ పూర్తి చేసుకుని రెండో దశలో ఉండగా సిరమ్ రెండో దశ బీ3 ప్రయోగాలు పూర్తి చేసుకుందన్నారు. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాలు ఎంపిక చేసిన 14 ప్రాంతాల్లో ప్రయోగించనున్నారని ఆయన వివరించారు. ఫ్లాస్మా థెరఫీ కరోనా రోగులకు బాగా పనిచేస్తున్నది, 14 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లోని ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో 468 మంది రోగులకు ఫ్లాస్మా థెరఫీ చేశారని భార్గవ పేర్కొన్నారు.

You might also like