FbTelugu

మే నెలాఖరుకు 3 కోట్ల స్పుత్నిక్ డోసులు

సెయింట్ పీటర్స్ బర్గ్: రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కు చెందిన 3 కోట్ల డోసులు మే నెలాఖరు వరకు ఇండియాకు చేరుకోవచ్చని రష్యాలో ఉన్న ఇండియా అంబాసిడర్ డి.బాలవెంకటేశ్ వర్మ తెలిపారు.

జూన్ నెలలో ఐదు కోట్ల డోసులు వస్తాయని, ఆగస్టు నెలలో ఇండియాలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఇండియాలో మొత్తం 85 కోట్ల స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. మొత్తం మూడు దశల్లో అమలు చేస్తున్నామన్నారు. మొదటి దశలో రష్యాను వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని, అది ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఆ తరువాత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ కంటైనర్లను పంపిస్తారన్నారు. మూడో దశలో రష్యా తన టెక్నాలజీని ఇండియాలోని కంపెనీలకు బదలాయిస్తారని తెలిపారు. ఇక అప్పటి నుంచే హైదరాబాద్ రెడ్డి ల్యాబ్స్ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తుందన్నారు. మొత్తం మూడు దశల్లో 85 కోట్ల డోసులు ఇండియాకు అందుతాయని అంబాసిడర్ వెంకటేశ్ తెలిపారు. సింగిల్ డోసు వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్ కు ఇంకా ఇండియా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.