FbTelugu

3 రాజధానుల స్టేటస్ కో 27 దాకా పొడిగింపు

అమరావతి: పరిపాలనా వికేంద్రీకరణ చట్టం పై ఉన్న స్టేటస్ కో ఆగస్ట్ 27 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశించింది.

స్టేటస్ కో ఎత్తివేయాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది కోరగా, హైకోర్టు నిరాకరించింది. ఆన్ లైన్ విచారణలో ఇబ్బందులు ఉన్నాయని, హైకోర్టులో నేరుగా విచారణ జరపాలని కోరిన పలువురు న్యాయవాదులు కోరారు. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది మాట్లాడుతూ, కరోనా కారణంగా కోర్టుకు రాలేమని చెప్పారు. ఆన్ లైన లోనే ఢిల్లీ నుండి వాదనలు వినిపిస్తామని రాకేశ్ ద్వివేది తెలిపారు. ఇరు వర్గాల నుంచి వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం విచారణను ఈ నెల 27 కు వాయిదా వేసింది.

You might also like