FbTelugu

3 నెలల్లో కరోనా మూలాలు తేల్చాలి: బైడెన్ ఆదేశం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ కరోనా వైరస్ మూలం కనుగొనేందుకు నడుం బిగించారు. దేశం లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముగింపు దశకు రావడం, కేసులు పూర్తిగా తగ్గడంతో ఆయన దృష్టి వైరస్ మూలం పై పడింది.

కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాలని ఇంటెలిజెన్స్ ఏజెన్సీని బైడెన్ ఆదేశించారు. ఈ వైరస్ జంతువుల నుంచి ఉద్బవించిందా, ప్రయోగశాల ప్రమాదం నుంచి వచ్చిందా అనేది తేల్చాలని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పలు దేశాలను చైనా ను వేలెత్తి చూపిస్తున్నాయి. వూహాన్ వైరల్ ల్యాబ్ నుంచి వచ్చాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అమెరికా పూర్వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… వైరస్ చైనా నుంచే ఇతర దేశాలకు వ్యాపించిందని, కుంగ్ ఫ్లూ వైరస్ అని, చైనా వైరస్ అని ఇలా పలు రకాల పేర్లు పెట్టారు. ఒకనొక దశలో ఆ దేశంపై దండయాత్ర చేయాలని భావించినప్పటికీ ఎన్నికలు ఉండడంతో వెనక్కి తగ్గారు.

అమెరికా ఇంటెలిజెన్స్ కు సహకరించాలని అమెరికా నేషనల్ ల్యాబొరేటరీ కి బైడెన్ వినతి చేశారు. తమ విచారణకు చైనా కూడా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. పూర్తి పారదర్శకత, సాక్ష్యాలతో ఆధారాలు, పూర్తి సమాచారం అందించడానికి చైనాను ఒత్తిడి చేయడాని తమ దేశం ప్రపంచంలోని భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని బైడెన్ తెలిపారు. అంతర్జాతీయ పరిశోధనలకు సహకరించకుండా చైనా నిరాకరిస్తే అసలు నిజాలు బయటకు రావని అన్నారు. కరోనా మూలాలపై దర్యాప్తును ఇప్పటికీ ఆ దేశం అడ్డుకుంటున్నదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.