FbTelugu

పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం.. 29 మంది మృతి

కరాచీ: పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుని 29 మంది సిక్కు యాత్రికులు మృతి చెందారు. వివరాల్లోకెళితే.. పాక్ లోని పంజాబ్ షేక్ పురా జిల్లాలో లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న షాహూసేన్ ఎక్స్ ప్రెస్ రైలు రైల్వే క్రాసింగ్ వద్ద ఓ బస్సును బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో బస్సులోని 29 మంది అక్కడికక్కడే మృతి చెందారు. నన్కనా సాహెబ్ యాత్ర నుంచి సిక్కులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.