FbTelugu

చేరిన 48 గంటల్లోనే 28 మంది మృతి

ఆగ్రా: యూపీలోని ఆగ్రా పట్టణంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్నది.

ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో 28 మంది కరోనా పాజటివ్ రోగులు చేరారు. చేరిన 48 గంటల వ్యవధిలో వారందరూ మృతి చెందడం సంచలనంగా మారింది. రెండు రోజుల వ్యవధిలో 28 మంది మృత్యువాత పడడంతో యోగి తీవ్రంగా పరిగణించారు.

ఆగ్రాలో ఎక్కువ సంఖ్యలో మృతి చెందడంపై విచారణకు ఆదేశించారు. ఒక్క ఆగ్రా నగరంలోనే ఇప్పటి వరకు 75 మంది చనిపోయారు. విద్యుత్ శాఖ కార్యదర్శి ఎం.దేవరాజ్ ఆగ్రా నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. యోగి నోడల్ అధికారి దేవరాజ్ తో మాట్లాడారు. రోగం ముదిరిన తరువాత ఆసుపత్రులకు వస్తున్నారని, వైద్య చికిత్సకు శరీరం సహకరించకపోవడం మూలంగా చనిపోతున్నారని ఆయన సీఎం కు వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.