FbTelugu

బస్సు ప్రమాదంలో 28 మంది మృతి

భోపాల్: సిద్ది నుంచి సాత్నా వెళ్తున్న బస్సు అదుపు తప్పడంతో కాలువలోకి దూసుకువెళ్ళింది. ఈ దుర్ఘటనలో 28 మంది ప్రయాణీకులు కాలువలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.
ఈ దుర్ఘటన ఇవాళ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలం లో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఏడు మృతదేహాలను బయటకు తీశారు.

మృతదేహాలను బయటకు తీసేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గత ఈతగాళ్లు రంగంలోకి దిగారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం కారణంగా మరణాల సంఖ్య పెరగవచ్చని అంటున్నారు. సహాయక చర్యలు వేగిరం చేయాలని, మృతుల కుటుంబాల కు బాసటగా నిలవాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సిద్ధి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
అదే విధంగా సహాయక చర్యలు వేగిరం చేసేందుకు ఎగువ ప్రాంతం నుంచి నీటి విడుదలను నిలిపివేయాలని సీఎం నీటి పారుదల శాఖ ను ఆదేశించారు. ఘటనా ప్రాంతం రోదనలతో దద్దరిల్లుతున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.