FbTelugu

28.30 లక్షల ఇళ్లు నిర్మిస్తాం: జగన్

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ లో 28 లక్షల 30 వేల ఇళ్లు నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన జిల్లాలో పర్యటించి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో మొదటి దశలో ఒక లక్షా 70 వేల ఇళ్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.

పేదలకు 6,232 ప్లాట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. తొలి విడతలో 5,548 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 30 లక్షల 70 వేల ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ సంక్రాంతి వరకు ప్రతిరోజూ పండుగ జరుగుతూనే ఉంటుందని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.