FbTelugu

ఏపీలో 2,765 కేసులు, 11 మరణాలు

అమరావతి: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 31,892 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,765 కొత్త కేసులు నిర్థారణ అయ్యాయి. 11 మంది చనిపోయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పోటాపోటీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 496 కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 490 కేసులు గుర్తించారు. విశాఖ జిల్లాలో 335, కృష్ణా జిల్లాలో 341, నెల్లూరు జిల్లాలో 292 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కొత్త కేసులు మాత్రమే నిర్థారణ అయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,245 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 9,18,597 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,94,896 మంది కోలుకున్నారు. ఇంకా 16,422 మంది చికిత్స పొందుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.