FbTelugu

శ్రీశైలం కుంభకోణంలో 27 మంది

కర్నూలు: శ్రీశైలం మల్లన్న దేవస్థానం కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. మల్లన్న సన్నిధిలో రూ.2.12 కోట్ల కుంభకోణం జరిగిందని తేల్చారు. ఈ కేసులో మొత్తం 27 మందిని అరెస్ట్ చేశారు.

డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా మోసాలు చేశారు. ఈ కుంభకోణంలో నిందితులపై 4 కేసులు నమోదు చేశారు. నాలుగు కేసుల్లో మొత్తం 27 మంది నిందితులను అరెస్ట్ చేశారు. షిఫ్ట్ బిఫోర్ క్లోజింగ్, లాగిన్ ఐడీ చేంజ్ ద్వారా ఈ మోసాలకు పాల్పడినట్టు వెల్లడైంది.

ఈ కుంభకోణంలో మొత్తం రూ.2.12 కోట్లు స్వాహా జరిగినట్టు నిర్థారించారు. పోలీసులు ఇప్పటివరకు రూ.83.40 లక్షలు రికవరీ చేశారు.

You might also like