FbTelugu

భారత్ లో కొత్తగా 26,500 కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలో లాక్ డౌన్ కు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది.

దేశంలో కొత్తగా 26,500 కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 475 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,93,802 కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 21,804 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 2,76,685 గా ఉంది.

You might also like