అమరావతి: ఏపీలో గడచిన 24 గంటల్లో 15,911 మంది నమూనాలు పరీక్షించగా 264 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో ప్రకటించింది. రాష్ట్రంలో 193 పాజిటివ్ కేసులు రాగా విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివి అదనంగా 71 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 6,720 కేసులు నమోదయ్యాయి.
గడచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 88కి చేరింది. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2851. ప్రస్తుతం 2341 మంది చికిత్స తీసుకుంటున్నారు.