FbTelugu

తెలంగాణలో సూపర్ స్ప్రెడర్లు 25 లక్షలు?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎవరి ద్వారా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది, వారు ఎవరు, ఏం చేయాలనే దానిపై లోతుగా అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలో పాతిక లక్షల మంది సూపర్ స్ర్పెడర్లు ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అంచనాకు వచ్చింది.

కరోనా వైరస్ ను వేగంగా అంటిస్తున్న వీరందరికీ యుద్దప్రాతిపదికన వ్యాక్సినేషన్ నిర్వహించకపోతే తెలంగాణ సమాజానికి ముప్పుగా భావిస్తున్నారు. త్వరలోనే వీరందరి కోసం వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. స్ట్రీట్ వెండర్స్, డ్రైవర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంకు కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు, డెలివరీ బాయ్స్ ను సూపర్ స్పెరడర్లుగా గుర్తించారు. ఈ మేరకు అన్ని జిల్లాల డిఎం అండ్ హెచ్ఓ ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో జిల్లా కలెక్టర్ల నుంచి సమ్రగ నివేదిక రానున్నది. నివేదిక అందిన తరువాత వీరందరికి వ్యాక్సినేషన్ ఏ ప్రాతిపదికన ఇవ్వాలి, ఎలా పూర్తి చేయాలనేది చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సూపర్ స్ర్పెడర్స్ కోసం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించి అమలుపర్చనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.