FbTelugu

గంగారామ్ ఆసుపత్రిలో మరణమృదంగం

న్యూఢిల్లీ: ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో లేక చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ పేషెంట్లు పిట్టల్లా రాలిపోతున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో మరణమృదంగం మోగుతోంది.
గడిచిన 24 గంటల్లో కరోనాతో 25 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఆస్పత్రిలో 510 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఐసియూలో వెంటిలేటర్లపై 60 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలు అయిపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.