FbTelugu

24 గంటల్లోనే కొత్తగా 8,909 కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రెండు లక్షల మార్కును దాటేశాయి. నేటకి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,07,615 కు చేరింది. మొదటి లక్ష కేసులు నమోదు కావడానికి రెండు నెలలు పట్టినా… రెండవ లక్ష కేసులు నమోదు కావడానికి పెద్దగా సమయం పట్టలేదు.

దీనికి ప్రధానంగా దేశంలో లాక్ డౌన్ కు సడలింపులను ఇవ్వడం వలస కూలీలు తమతమ ప్రాంతాలకు వెళ్లడం కారణంగా చెప్పవచ్చు. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 5,815 మంది కరోనాతో మృతి చెందారు. గత 24 గంటల్లోనే కొత్తగా 8,909 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 217 మంది మృత్యువాత పడ్డారు.

You might also like