FbTelugu

ఒకే అపార్ట్ మెంట్ లో 23 మందికి…

హైదరాబాద్: ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటున్న 23 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మాదన్నపేట ప్రాంతాన్ని కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించి భద్రత కట్టుదిట్టం చేశారు.

కరోనా విజృంభిస్తున్నందున విందులు, విలాసాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం చెబుతున్న చదువుకున్నవారు కూడా విన్పించుకోవడం లేదు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వైభవంగా బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకులకు అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న పలువురు హాజరై మందు, విందు చేసుకున్నారు. హాజరైన వారిలో 23 మందికి పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. వీరిని పరీక్షించిన తరువాత సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా జీహెచ్ఎంసీ ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.