FbTelugu

భారత్‌ బంద్‌లో 23 పార్టీలు

బంద్ నుంచి వైదొలిగిన టీఎంసీ

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలపై తలపట్టిన భారత్ బంద్ లో 23 పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి.
ఈ బంద్ లో పాల్గొనడం లేదని పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణముల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీ సోమవారం నాడు ప్రకటించారు. అయితే ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని లేదా పదవి నుంది నరేంద్ర మోదీ వైదొలగాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇవాళ్టి బంద్ లో కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, శిరోమణి అకాలీదళ్‌, ఎన్సీపీ, జేఎంఎం, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ(ఎంఎల్‌), పీఏజీడీ (గుప్కర్‌ కూటమి), టీఆర్ఎస్, మజ్లీస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీఎస్‌, బీఎస్పీ, పీడబ్ల్యూపీ, బీవీఏ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వార్డ్‌ బ్లాక్‌, స్వరాజ్‌ ఇండియా, ఎస్‌యూసీఐ (సీ) పార్టీలు తమ పూర్తి మద్దతును తెలిపాయి. మంగళవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు బంద్‌ జరుగుతుందని రైతులు వెల్లడించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.