FbTelugu

ట్రక్కు ఢీకొని 23 మంది వలస కూలీలు మృతి

లక్నో: వలస కూలీలతో వెళుతున్న ఓ ట్రక్కును మరో ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో 23 మంది వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ తెల్లవారు జామున

యూపీలోని ఔరాయ జాతీయ రహదారిపై వలస కూలీలతో ఓ ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా.. మరో ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 23 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికి తీవ్రగాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.

You might also like