FbTelugu

తెలంగాణలో కొత్తగా 2,273 కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో కొత్తగా 2,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 12 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,844 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 996 కి చేరింది. ఇప్పటి వరకు 1,31,447 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 30,401 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like