FbTelugu

ఏపీలో 22,399 పాజిటివ్ కేసులు

అమరావతి: ఏపిలో కరోనా వైరస్ ఎంతకూ తగ్గనంటున్నది. గడచిన 24 గంటల వ్యవధిలో 22,399 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించారు.
ఈ కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 13,66,785కి చేరుకున్నది.

కరోనాతో తాజాగా 89 మంది చనిపోగా.. ఇప్పటి వరకు 9,077 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 11,56,666 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 2,01,042గా ఉన్నాయి. నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,77,02,133 నమూనాలను పరీక్షించినట్లు బులెటిన్ లో పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.