FbTelugu

ఒకే కుటుంబంలో 22 పాజిటివ్ కేసులు

సూర్యాపేట : అనారోగ్యం పాలైన ఓ వ్యక్తికి కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో.. అనుమానంతో కుటుంబంలోని వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏకంగా ఆ కుటుంబంలోని 22 మందికి కరోనా సోకినట్టుగా గుర్తించారు. వివరాల్లోకెళితే.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నివాసం ఉండే ఓ కుటుంబంలోని ఓ వ్యక్తి ఇటీవల తమ బంధువు అంత్యక్రియలకు హాజరై వచ్చాడు.

సదరు వ్యక్తికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. అతని కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా కుటుంబంలోని 22 మందికీ కరోనా సోకినట్టుగా డీఎంహెచ్‌ఓ హర్షవర్ధన్‌ తెలిపారు. ప్రస్తుతం వారిని హోం క్వారంటైన్ లో ఉంచినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.