FbTelugu

చిలకల ఉచ్చు నెమళ్లకు శాపం…

చెన్నై: చిలకలను పట్టుకునేందుకు పెట్టిన ఉచ్చు నెమళ్ల పాలిట శాపాలుగా మారాయి. ఉచ్చులో చిక్కకుని 22 నెమళ్లు మృత్యువాతపడ్డాయి. వీటి మృతికి కారణమైన వ్యక్తిని అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు.

మనప్పారై సమీపంలోని కిలపొయిగైపట్టికి చెందిన రాసు (60) కు చెందిన తోటలో సోమవారం రాత్రి 22 నెమళ్లు చనిపోయి కన్పించాయి. ఇవి చూసిన ఇరుగుపొరుగు రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు వాటిని పోస్టుమార్టం పంపించి, ఆ తరువాత ఖననం చేశారు. చిలకల కోసం పెట్టిన ఉచ్చులో పడి చనిపోయాయని తోట యజమాని రాసు, ఆయన భార్య పొన్నమ్మాళ్ తెలిపారు. పొన్నమ్మాళ్ అరెస్టు కాగా రాసు పరారీ అయ్యాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.