FbTelugu

22 డెల్టా ప్లస్ కేసులు: కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో డెల్టా ప్లస్ వైరస్ తో కరోనా కేసులు నమోదు అవుతున్నాయని, ఇప్పటి వరకు 22 మందికి సోకిందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మహారాష్ట్రలోనే కేవలం 16 కేసులు ఉన్నాయని తెలిపింది.

డెల్టా రకంలో మ్యుటేషన్ వచ్చిన ఫలితంగా డెల్టా ప్లస్ గా అవతరించిందని, తొమ్మిది దేశాలలో ఈ రకం వైరస్ విజృంభిస్తున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్, కేరళలో ఈ కేసులు ఉన్నాయని, ఆందోళన కలిగించే అంశమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ కొత్త రకం వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.