FbTelugu

తెలంగాణలో ఒక్కరోజే 22 కేసులు

ముగ్గురు మృతి

హైదరాబాద్: రెండు మూడు రోజుల పాటు తక్కువ సంఖ్యలో ఉండగా ఈరోజు  కరోనా పాజిటివ్ కేసులు 22 నమోదు అయ్యాయి.

తెలంగాణా ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ఇవాళ కొత్తగా  22 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ప్రకటించింది. పాజిటివ్ సోకిన ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందగా… ఇప్పటివరకు 28 మంది చనిపోయారు.

ఈ రోజు వరకు తెలంగాణా లో 1038 కేసులు నమోదు కాగా, అక్టివ్ కేసులు 568 ఉన్నాయి.

ట్రీట్ మెంట్ పూర్తి చేసుకున్న 33 మంది డిశ్చార్జీ కాగా ఇప్పటి వరకు 442 మంది చికిత్స తీసుకుని హాస్పిటళ్ల నుంచి ఇళ్లకు వెళ్లారు.

You might also like